రైల్వేకోడూరును అభివృద్ధి చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:15 PM
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.
రైల్వేకోడూరు, జూన 11(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట గ్రామ పంచాయతీ కేంద్రంలో రూ.50 లక్షలతో సిమెంట్ రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేక వెనుకబడి ఉన్న సమయంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో ఐదు మండలాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతన్నాయన్నారు. రాబోవు నాలుగేళ్లలో రైల్వేకోడూరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపు తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా డీసీఎంస్ చైర్మన ఎర్రగుండ్ల జయప్రకాష్, కూటమి నాయకులు బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, నాగినేని వెంకటరమణ, చంద్రశేఖర్, కొమ్మా శివ, ఉప సర్పంచ కంచిరాజు రామరాజు, శేఖర్. గడికోట సుబ్బరాయుడు, పీఆర్ డీఈ బాలనరసింహులు తదితరులు పాల్గొన్నారు.