Share News

బ్రహ్మంగారిమఠం దేవస్థానం అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 04 , 2025 | 11:25 PM

కాలజ్ఞాన సృష్టికర్త, భూత భవి ష్యత వర్తమాన కాలాన్ని ముందుగానే తెలియజేసిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర్రబహ్మేంద్రస్వామి దేవ స్థానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

బ్రహ్మంగారిమఠం దేవస్థానం అభివృద్ధే లక్ష్యం
కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌

కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌

బ్రహ్మంగారిమఠం, మే 4 (ఆంధ్రజ్యో తి): కాలజ్ఞాన సృష్టికర్త, భూత భవి ష్యత వర్తమాన కాలాన్ని ముందుగానే తెలియజేసిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర్రబహ్మేంద్రస్వామి దేవ స్థానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాలు 4వతేదీ నుంచి మే 9 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సందర్భంగా దేవదాయశాఖ అధికారి దేవ స్థానం ఫిట్‌పర్సన శంకరబాలాజీ ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం దేవస్థానాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం పూర్వపు మఠాధిపతుల కుటుంబ సభ్యులు ఎమ్మె ల్యేను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల రూ.3కోట్లుతో నిర్మాణం చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇటీవల ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, యాత్రికుల విశ్రాంతి గదులు, పోలేరమ్మ దేవస్థానం వద్ద సీసీ రోడ్లు ప్రారంభం అలాగే ప్రధాన ఆలయం వద్ద సిబ్బంది ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి రూ.3కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం బస్టాండు లేకపోవడంతో తాత్కాలిక బస్‌షెల్టరు నిర్మాణం చేపట్టుకో వాలని రూ.10లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, యువ నాయకులు కాణాల మల్లిఖార్జునరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు 3వేల మజ్జిగ ప్యాకెట్లు ఆదివారం మొదటి రోజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ నారాయణ, చిల మల నాగయ్య, దేవస్థానం ఫిట్‌పర్సన శంకరబాలాజీ, ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి, పెరుగు నాగేంద్ర, గుజ్జు రామాంజనేయులు, ఓబులపతినాయుడు, నరసింహగౌడ్‌, సంపతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:25 PM