మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:55 PM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభు త్వ లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షు డు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి
రాజంపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభు త్వ లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షు డు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేట మండలంలోని శేషమాంబపురం, పాపరాజుపల్లె గ్రామాల్లో ఇం టింటికి సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలుకరిస్తూ కూటమి ప్రభుత్వం యేడాదిలో నిర్వహించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన డైరెక్టర్ అద్దేపల్లె ప్రతా్‌పరాజు, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.