Share News

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కమిషనర్‌

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:41 PM

రాజంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు సూచించారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కమిషనర్‌
పూడికతీత పనులను పర్యవేక్షిస్తున్న కమిషనర్‌ శ్రీనివాసులు

రాజంపేట టౌన, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాజంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు సూచించారు. మంగళవారం మండలంలోని పట్టణంలోని సాయినగర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కాలువలోని పూడికతీతను వెలి కి తీయించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వర్షం నీరు కాలువలో సాఫీగా పోయేందుకు చెత్తా చె దారాన్ని తొలగిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా బాధ్యతగా చెత్తను రోడ్లపై, కాలువలో వేయకుండా మున్సిపల్‌ కార్మికులకు అందించాలన్నారు. లేకుంటే వీధి చివరలో ఉన్న చెత్తకుండీలో వేయాలన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:41 PM