Share News

సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:45 PM

ప్రజలకు సుపరిపాలన అందించడ మే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం
బుడుగుంటపల్లిలో నిర్వహించిన సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న ముక్కా

కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి

రైల్వేకోడూరు రూరల్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సుపరిపాలన అందించడ మే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని బుడుగుంటపల్లి, సమతనగర్‌ గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఏడాది చేసిన సంక్షేమ పథకాలను వివరించామని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రజలకు ఏలోటు రాకుండా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపన పడుతున్నారని తెలిపారు. గిరిజనులు, దళితులు, వెనకబడిన తరగతుల ప్రజలతో ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడినప్పుడు అనేక సమస్యలు భయటపడ్డాయని వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తొలిఅడుగు కార్యక్రమం లో ప్రజా సమస్యలన్నింటిని నమోదు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునిపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడూరు మాజీ సర్పంచ మురళిధర్‌ గౌడ్‌, సీనియర్‌ మైనార్టీ టీడీపీ నాయకుడు పఠాన మౌలా, పోకల మణి, తల్లెం వెంకటరమణారెడ్డి, బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, గడికోట సుబ్బరాయుడు, తిరుపతి శేఖర్‌, సిద్ధేశ్వర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:45 PM