ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యం
ABN , Publish Date - May 20 , 2025 | 11:39 PM
నాటి కాంగ్రెస్ అవినీతి పాలన పై తిరుగుబాటు చేసి ప్రజా సంక్షేమానికి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.
కడపలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని పిలుపు మినీ మహానాడులో ప్రొద్దుటూరు అభివృద్ధిపై పలు తీర్మానాలు
ప్రొద్దుటూరు , మే 20 (ఆంధ్రజ్యోతి) : నాటి కాంగ్రెస్ అవినీతి పాలన పై తిరుగుబాటు చేసి ప్రజా సంక్షేమానికి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును స్ధానిక భారత ఫంక్షన హాలులో ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రాంగణంలో టీడీపీ జెండాను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎగురవేసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త పార్టీ ఆవిర్బావంతో పాటు ఎన్టీఆర్ చంద్ర బాబుల కృషిని తెలుసుకోవాలన్నారు. కడప జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయడంలో బాగంగా టీడీపీ జాతీయ మహానాడు ను కడపలో నిర్వహిస్తోందన్నారు. టీడీపీకి ప్రధాన రాజ కీయ ప్రత్యర్థి ఉన్న ఈ జిల్లాలో ధీటుగా పార్టీ బలం కనబరచాలన్నా రు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీని వాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వంను పంపిం చేందుకు చం ద్రబాబును గెలిపిస్తే ప్రొద్దుటూరులో రాక్షసున్ని ఓడించి పెద్దాయన వరదరాజుల రెడ్డిని గెలిపించి ప్రభంజనం సృష్టించారన్నారు. మహానాడు పూర్తి అయ్యా క జిల్లా పట్టణ మండల స్దాయి పార్టీ పదవులు క్యాడర్‌కు ఇచ్చే కార్యక్ర మం పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మా ట్లాడుతూ తాను నీతి నిజాయితీ కట్టుబడి నిస్వార్ధంగా ప్రజల కు సేవలందిస్తానన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొం డారెడ్డి, పార్టీ పరిశీలకుడు ప్రసాద్ మాట్లాడారు.
మినీ మహానాడులో ఆమోదించిన తీర్మానాలు : ఈ సంద ర్బంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పట్టణ మాజీ అధ్య క్షుడు ఘంటశాల వెంక టేశ్వర్లు, కుందూ పెన్నా కాలువ పూర్తి చేయాలని మాజీ ఎంపీపీ రాఘవరెడి,్డ డ్రైనేజీ వ్యవస్ధ ఆధునీక రణపై నంద్యాల కొండారెడ్డి, ఉక్కు కర్మాగారంపై ఈవీ సుధాక ర్‌రెడ్డి, దుస్తుల పరిశ్రమపై ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ,స్వర్ణకారు లకు క్లస్టర్ ఏర్పాటుపై సీఎం సురేష్‌నాయుడు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పై ఆసం రఘురామిరెడ్డి, మెడికల్‌కాలేజీపై బసిరెడ్డి రాజేశ్వర రెడ్డి, నూతన కూరగాయ మార్కెట్‌పై వీఎస్ ముక్తియార్, రోడ్లు విస్తరణపై నల్లబోతుల నాగరాజు, కార్మికుల సంక్షేమం పై కుతు బుద్దీన, చేనేత క్లస్టర్ కోసం బొర్రా రామాంజనేయులు తీర్మానా లు ప్రతిపాదించారు. వాటిని జాతీయ మహానాడుకు పంపుతా మన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ బోడెల బాబుల్‌రెడ్డి టౌన బ్యాంక్ చైర్మ న సుబ్బారెడ్డి, సర్పంచ కొనిరెడ్డిశివచంద్రారెడ్డి, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ జాకీర్, బచ్చల ప్రతాప్, మున్సిపల్ కౌన్సిల్లర్లు మురళీధర్‌రెడ్డి , జ్యోతి, వెంకటలక్ష్మీ, మునీర్, గౌస్, కమాల్,జిలాన, మాజీ కౌన్సిల్లర్ బద్వేలు శ్రీనివా సులరెడ్డి తలారి పుల్లయ్య జయశంకర్ టీడీపీ నాయకుడు రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్, దస్తగిరి, వంగల నారా యణరెడ్డి, రసూల్‌గౌస్ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికలలోపు వైసీపీ భూస్థాపితం ఖాయం
జమ్మలమడుగు, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2029 లోపు వైసీపీ భూస్థాపితం అవుతుందని, ఆ పార్టీలో జగన్‌మోహన్‌రెడ్డి వద్ద పనిచేసినవారంతా అధికారులు జైళ్లకు వెళుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నానుబాళ్ల ఎల్లప్ప ఫంక్షన్ హాలులో నియోజకవర్గ మినీ మహానాడును ఇనచార్జి భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు మహానాడు కార్యక్రమం జరుగనుందని పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సూపర్-6 పథకాలు అమలు చేస్తామని తగ్గేదే లేదన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ ప్రభుత్వం చంద్రబాబునాయుడు రూ.4 వేలు పింఛను అందజేస్తున్నారన్నారు. జమ్మలమడుగులో గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనల ప్రాంతంలోనే చంద్రబాబునాయుడు స్టీల్‌ప్లాంట్ పనులను చేపడతారన్నారు. టీడీపీ ఇన్ చార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కడపలో జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరుగుతున్న పనులను జరిగిన వాటిని ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ నామినేటెడ్ పదవులలో నాయకులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్‌సెల్ ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, టీడీపీ మైనార్టీ నాయకుడు మస్తాన్, టీడీపీ నాయకులు చేరెడ్డి చెన్నకేశవరెడ్డి, చిన్నపసుపుల శ్రీనివాసులరెడ్డి, దేవగుడి శివనారాయణరెడ్డి, పొన్నతోట శ్రీను, కర్ణాటి రామాంజనేయరెడ్డి, గౌస్ అహమ్మద్, కొండాపురం నాగేశ్వరరెడ్డి, ఎర్రగుంట్ల మోహన్‌రెడ్డి, ముద్దనూరు శివరామిరెడ్డి, దువ్వూరి మురళి, మైలవరం రాజారెడ్డి, జనసేన నాయకులు నాగార్జున, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.