Share News

జడ్పీటీసీల విజయంపై టీడీపీ సంబరాలు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:19 PM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజ యం సాధించడంతో ఆపార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

జడ్పీటీసీల విజయంపై టీడీపీ సంబరాలు
జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చుతున్న కార్యకర్తలు

జమ్మలమడుగు/మైదుకూరురూరల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజ యం సాధించడంతో ఆపార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జమ్మలమడుగులో గురువారం టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం పొందినందుకు కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా మైదుకూరులో టీడీపీ నాయకులు గురువారం బాణ సంచా పేల్చి,స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ పులివెందుల ప్రజలు స్వఛ్చందగా బయ టకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొ న్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మైదుకూ రు పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ పాశం మారుతి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధనపాల జగన్‌, బండి అమర్‌ నాధ్‌, పెంచల్‌ తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల తీర్పు జగన్‌కు చెంపపెట్టు

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జగన్‌కు చెంపపెట్టని ఆ పార్టీ బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రెండు జడ్పీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందిన సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో 30 సంవత్సరాలుగా జగన్‌ ప్రజలను ఓటుకు దూరం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాలు జగన్‌ అహంకారానికి, ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.కార్యక్రమంలో నందమూరి యువసేవా సమితి అధ్యక్షుడు గోమేధికం సుదర్శన్‌, జనసేన నాయకుడు బాలసుబ్రమణ్యం, వెంకటరమణ, చంద్రమోహన్‌రెడ్డి, రమణారెడ్డి, బాలరాజు, ప్రవీణ్‌, టీడీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సురేష్‌, వెంకటేష్‌, బాషా పాల్గొన్నారు.

ఖాజీపేటలో: మండల పరిధిలోని కొత్తపేట జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు వాకమల్ల వెంకటరామిరెడ్డి, రెడ్యం వెంకట్రామిరెడ్డిల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కార్యకర్తలకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. పులివెందుల ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని వారు ఓటుతో వైసీపీకి బుద్ధిచెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట, చెముళ్లపల్లె టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:19 PM