Share News

పన్నులు సకాలంలో చెల్లించాలి : కమిషనర్‌

ABN , Publish Date - May 23 , 2025 | 12:06 AM

మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వా ర్డుల్లో సకాలంలో పన్ను లు చెల్లించాలని పురపాలక కమిషనర్‌ జి.శ్రీనివాసులు తెలిపారు.

పన్నులు సకాలంలో చెల్లించాలి : కమిషనర్‌
మాట్లాడుతున్న శ్రీనివాసులు

రాజంపేట, మే 22 (ఆంధ్రజ్యోతి) : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వా ర్డుల్లో సకాలంలో పన్ను లు చెల్లించాలని పురపాలక కమిషనర్‌ జి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం లో గురువారం వార్డు అ డ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శులకు కమిషనర్‌ జి.శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలకలో కుళాయి, ఇంటి పన్నులను సకాలంలో చెల్లించేందుకు ప్రజలకు సెక్రటరిలు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సచివాలయంలో ఉండే సమస్యలను గుర్తించి తక్షణమే సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. మున్సిపాలిటి పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలన్నదే మన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరిలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:06 AM