Share News

దోమల నివారణకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:07 PM

దోమల నివారణకు చర్యలు తీసు కోవాలని పి.కొత్తపల్లె ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ వైద్యాధికారిణి రంగలక్ష్మి అన్నా రు.

దోమల నివారణకు చర్యలు తీసుకోండి
డాక్టర్‌ రంగలక్ష్మి, మైద్యాధికారిణి, పి.కొత్తపల్లె పీహెచసీ

సిద్దవటం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దోమల నివారణకు చర్యలు తీసు కోవాలని పి.కొత్తపల్లె ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ వైద్యాధికారిణి రంగలక్ష్మి అన్నా రు. శనివారం ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం దోమలు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని, దీని వల్ల వైరల్‌ ఇన్పక్షన, అధిక జ్వరం, కళ్లు మంటలు, తలనొప్పి, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు ఉం టాయన్నారు. దోమలు కుట్టకుండా రక్షణ ర చ్యలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. రాత్రి వేళల్లో దోమతెర వాడాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉంటే స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:07 PM