Share News

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:38 PM

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగప్రసాద్‌ తెలిపారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధిహామీ పనుల వద్ద మాట్లాడుతున్న ఎంపీడీవో వెంకటరమణయ్య

కొండాపురం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలందరికి చేరువ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను కోరారు. ఎంఈవో రామయ్య మాట్లాడుతూ పాఠశాల మరమ్మతులకు సంబంధించి జూలై తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. విద్యుత నాణ్యతను మెరుగుపరిచేందుకు గ్రామాలలో త్రీఫేస్‌ కింద విద్యుత సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని ఇందుకు సంబంధించిన పనులు మండలంలో మొదలవుతాయని ఏఈ రామకృష్ణ తెలిపారు. ఉపాధి కింద గ్రామాలలో నీటితొట్టెలు ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీవో వెంకటలక్ష్మి తెలిపారు. గొర్రెలు, పొట్టెళ్లు, నాటుకోళ్ల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని పశువైధ్యాఽధికారి రాజశేఖ రరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడూరు ఎంపీటీసీ రామమునిరెడ్డి, చామలూరు సర్పంచ రాఘవేంద్రారెడ్డి, ఏవో ఏవీరామాంజులరెడ్డి, హౌసింగ్‌ ఏఈ గురురాజ ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:38 PM