వైద్యశాల స్థలం హద్దుల ఏర్పాటుకు సర్వే
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:11 PM
మండలంలోని మాధవరం-1 గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల స్థలం కబ్జా విషయమై హద్దుల ఏర్పాటుకు బుధవారం అధికారులు సర్వే నిర్వహించారు.
సిద్దవటం, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మాధవరం-1 గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల స్థలం కబ్జా విషయమై హద్దుల ఏర్పాటుకు బుధవారం అధికారులు సర్వే నిర్వహించారు. తహసీల్దారు తిరుమలబాబు ఆదేశాల మేరకు హద్దుల ఏర్పాటుకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేయర్ సోమశేఖర్ మాట్లాడుతూ మాధవరం హెల్త్‌సెంటర్ వైద్యాదికారి శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థల సేకరణ కోసం సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన స్థలంలో కొన్ని కట్టడాలు ఉన్నాయని, నిర్ధారణ చేసి మూడు రోజుల్లో నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, హెల్త్‌సెంటర్ అభివృద్ధి సలహామండలి చైర్మన సామా శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.