కష్టపడి చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:02 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఏపీ ఫుడ్ కార్పొరేషన చైర్మన చిత్తా విజయప్రతాప్‌రెడ్డి సూచించారు.
ఏపీ ఫుడ్ కార్పొరేషన చైర్మన విజయప్రతాప్‌రెడ్డి
కలసపాడు, జూన 24 (ఆంధ్రజ్యో తి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఏపీ ఫుడ్ కార్పొరేషన చైర్మన చిత్తా విజయప్రతాప్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మండల పరి ధిలోని పెండ్లిమర్రి వద్దనున్న కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా వంటశాల, స్టోర్, ఆఫీస్ రూములను పరిశీలించారు. విద్యార్థినులకు వండిన వంట లను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై ఆయ న పాఠశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం బాగుందని, మెనూలో టిఫెనలో మార్పులు చేస్తామని ఆయన విద్యా ర్థినులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడాలని ఉపాధ్యా యులకు ఆయన సూచించారు.