బీసీ హాస్టళ్లలో లోపాలు ఉంటే కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:00 AM
బీసీ హాస్టళ్లలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేశకుమార్ హెచ్చరించారు.
రాయచోటి(కలెక్టరేట్), జూలై26(ఆంధ్రజ్యోతి): బీసీ హాస్టళ్లలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేశకుమార్ హెచ్చరించారు. శనివారం సాయం త్రం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లాలోని వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్ల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లలకు ఎప్పటికప్పుడు మెడికల్ చెక్‌పలు చేయించాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. నిర్వహణలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.