నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:30 PM
నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని లక్కిరెడ్డిపల్లె అర్బన స్టేషన ఎక్సైజ్ సీఐ కిశోర్‌కుమార్ హెచ్చరించారు.
లక్కిరెడ్డిపల్లె, జూన27(ఆంధ్రజ్యోతి): నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని లక్కిరెడ్డిపల్లె అర్బన స్టేషన ఎక్సైజ్ సీఐ కిశోర్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం కోనంపేట పంచాయతీలో ని వడ్డెపల్లిలో నాటుసారా విక్రయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు విస్తృత దాడులు చేపట్టారన్నారు. ఆ గ్రామ సర్పంచ, రెవెన్యూ అధికారి, మహిళా పో లీస్, కమిటీ సభ్యులు అటవీశాఖ బీట్ అధికారి, గ్రామ ఫీల్డ్ అసిస్టెం ట్, స్వయం సహాయక సంఘాలు నాటుసారాపై అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా నాటు సారా కాచి విక్రయిస్తే 12405 లేదా 9440902594కు ఫోన చేసి తెలియజేయాలన్నారు.