Share News

ఫ్యాక్షన రాజకీయాలకు దూరంగా ఉండండి

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:06 AM

గ్రామాల అభివృద్ధితో పాటు యువత భవి ష్యత్తును తీర్చిదిద్దేలా వ్యవసాయంవైపు దృష్టి సారించాలే తప్ప ఫ్యాక్షన రాజకీయా లకు వెళ్లరాదని రూరల్‌ సీఐ బాలమద్దిలేటి పేర్కొన్నారు.

 ఫ్యాక్షన రాజకీయాలకు దూరంగా ఉండండి
సమావేశంలో మాట్లాడుతున్న రూరల్‌ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ రాజు

ప్రొద్దుటూరు , ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధితో పాటు యువత భవి ష్యత్తును తీర్చిదిద్దేలా వ్యవసాయంవైపు దృష్టి సారించాలే తప్ప ఫ్యాక్షన రాజకీయా లకు వెళ్లరాదని రూరల్‌ సీఐ బాలమద్దిలేటి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధి లోని పెద్దశెట్టిపల్లె పంచాయతీ శంకరాపురం గ్రామంలో రూరల్‌ సీఐ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్బంగా రూరల్‌ సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ అమాయక ప్రజలను సులభంగా మోసం చేసే సైబర్‌ నేరాలు పెరిగి పోయాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:06 AM