సంపాదనలో కొంత సమాజసేవకు ఇవ్వాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:54 PM
మన సం పాదనలో కనీసం ఒక శాతమై న సమాజసేవ కోసం ఖర్చుచేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణ రెడ్డి పే ర్కొన్నారు.
ఎర్రగుంట్ల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మన సం పాదనలో కనీసం ఒక శాతమై న సమాజసేవ కోసం ఖర్చుచేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణ రెడ్డి పే ర్కొన్నారు. ఎర్రగుంట్ల మం డలం తిప్పలూరు పీఏసీ ఎస్ ఛైర్మనగా ఇల్లూరు బంగారుమునిరెడ్డి, సున్నపు రాళ్లపల్లె పీఏసీఎస్ చైర్మనగా మల్లుగోపాల్‌రెడ్డిల ప్రమాణస్వీ కారోత్సవం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జి సి.భూపేష్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది మా ట్లాడుతూ రాష్ట్రంలో పీ4 ఒక బృహత్తరప థకంగా అభివర్ణించారు. టీడీపీ ఇనచార్జి సి.భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయినట్లు తెలిపారు.
పీ4కు నావంతు కృషి చేస్తా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ4కు తన వంతుగా రూ.3లక్షలు ఇస్తు న్నట్లు తిప్పలూరు పీఏసీఎస్ ఛైర్మన ఇల్లూరు బంగారుముని రెడ్డి ప్రకటించారు. అందుకు సం బందించిన చెక్కును ప్రమాణస్వీ కార వేదికపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, సి.భూ పేష్‌రెడ్డికి అందజేశారు.
రైతులకు మంచి సేవలందిస్తాం: తిప్పలూరు, సున్నపురాళ్లపల్లె పీఏసీ ఎస్ ఛైర్మన్లుగా ప్రమాణస్వీకారం చేసిన ఇల్లూరు బంగారు మునిరెడ్డి, మల్లుగోపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మంచి సేవలందిస్తామన్నారు. వ కార్యక్రమంలో మండల ఇనచార్జి ఎం.మధుసూధనరెడ్డి, సొసైటీ అధికారులు, డీసీసీ బ్యాంకు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.