గుంజననది రక్షణగోడ దీక్షకు సంఘీభావం
ABN , Publish Date - May 24 , 2025 | 11:15 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన డాక్టర్ సయ్యద్ అహ్మద్ గుంజననదికి రక్షణగోడ నిర్మించాలంటూ చేపట్టిన దీక్షకు సీఐటీయూ, వైసీపీ నాయకులతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరు, మే 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన డాక్టర్ సయ్యద్ అహ్మద్ గుంజననదికి రక్షణగోడ నిర్మించాలంటూ చేపట్టిన దీక్షకు సీఐటీయూ, వైసీపీ నాయకులతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా గుంజననదికి రక్షణ గోడ లేక వర్షాలు కురిసినప్పుడల్లా పేదల ఇళ్లు కూలుతున్నాయ న్నారు. రక్షణగోడ చేపట్టకపోతే ఆమరణ దీక్షలు చేయాల్సి వస్తుందన్నారు. పది రోజుల్లో పనులు మొదలు పెడతామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా దీక్షలు విరమించారు. కాంగ్రెస్ ఇనచార్జ్ గోశాల దేవి, సీనియర్ నాయకులు కదిగాళ్ల శాంతయ్య, మదనపల్లె ఇనచార్జ్ రెడ్డిసాహెబ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.