Share News

ఘనంగా సామూహిక ఉపనయనాలు

ABN , Publish Date - May 02 , 2025 | 11:42 PM

స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదిశంకరాచార్యుల జయంతిని పురష్కరించుకుని బ్రాహ్మణ వఽటువులకు సామూహిక ఉపనయనాలను ఉచితంగా నిర్వహించారు.

ఘనంగా సామూహిక ఉపనయనాలు
సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో ఆదిశంకరాచార్యుల జయంతిని పురష్కరించుకుని బ్రాహ్మణ వఽటువులకు సామూహిక ఉపనయనాలను ఉచితంగా నిర్వహించారు. కడప జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపనయనాలులో జిల్లా వ్యాప్తంగా 25 మంది వటువులు పాల్గొన్నారు. వఽటువులకు పండితులు యజ్ఞోపవీత ధారణ, బ్రహ్మోపదేశం చేసి శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కుటుంబ పెద్దలు, బ్రాహ్మణ పెద్దలు ఆశీర్వదించారు.

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వైఎంఆర్‌ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో వటువులకు సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించారు. దుర్బాక వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పది మంది వఽటువులకు ఉపనయనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కంబగిరిరావు, బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:42 PM