Share News

సోలార్‌ బాధితులకు త్వరలో పరిహారం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:14 AM

తూముకుంట పంచాయతీ ప్రకాశనగర్‌ కాలనీ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు భూములు కోల్పోతున్న రైతులకు త్వరలో నష్టపరిహారం అందజేయనున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

సోలార్‌ బాధితులకు త్వరలో పరిహారం
గుండ్లచెరువులో పర్యటిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

గాలివీడు,జూన8(ఆంధ్రజ్యోతి): తూముకుంట పంచాయతీ ప్రకాశనగర్‌ కాలనీ సమీపంలో ఏర్పాటు చేయనున్న నూతన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు భూములు కోల్పోతున్న రైతులకు త్వరలో నష్టపరిహారం అందజేయనున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ యన ఆదివారం గుండ్లచెరువుకు చెందిన టీడీపీ నా యకుడు ఉదయ్‌కుమార్‌ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 100 మెగావాట్లతో సోలార్‌ విద్యుత పవర్‌ ప్లాంట్‌ను తూముకుంట పంచాతీలో ఏర్పాటు చేయనున్నారని, ఇందులో 64 ఎకరాలు డీకేటీ భూమి, 30 ఎకరాలు సాగుభూమి, 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. గతంలో డీకేటీ భూమికి రెండు లక్షలు ఇచ్చారని, కానీ ఏడాది ఎక్కువ మొత్తలో ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అలాగే ఎలాం టి ఆధారాలు లేకుండా అనుభవంలో గల భూమికి ఎకరాకు రూ.లక్ష ఇప్పించడానికి కృషి చేస్తానని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:14 AM