బయోగ్యాస్, విండ్‌మిల్ కోసం స్థల పరిశీలిన
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:08 AM
మండలంలో బయోగ్యాస్, విండ్‌మిల్ ఏర్పాటు కోసం మంగళవారం ఆర్డీవో సాయిశ్రీ స్థల పరిశీలిన చేశారు.

ముద్దనూరు, జూలై1(ఆంధ్రజ్యోతి):మండలంలో బయోగ్యాస్, విండ్‌మిల్ ఏర్పాటు కోసం మంగళవారం ఆర్డీవో సాయిశ్రీ స్థల పరిశీలిన చేశారు. యామవరం గ్రామ సమీపంలో రిలయన్స్ బయోగ్యాస్, బొందలకుంట గ్రామ సమీపంలో ఎకోరిన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టే గాలిమరల విద్యుత్ కోసం స్థలాన్ని పరిశీలించారు. తరువాత జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజశాలను పరిశీలించి ,బెంచీల పై నే విద్యార్థులకు భోజన వసతి కల్పించాలన్నారు. విద్యార్థినుల మరుగు దొడ్డలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు అలీఖాన్, డీటీ వదరకిశోర్‌రెడ్డి ,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.