డంపింగ్ యార్డు నిర్మించరా..?
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:27 PM
ఎర్రగుంట్లనగరపంచాయతికి డంపిం గ్ యార్డు ఒక కలగా మిగిలిపోయింది.

దశాబ్దాలు గడిచినా రోడ్లపైనే చెత్తపడవేసి నిప్పు పెట్టడంతో దట్టమైన పొగలు ఇబ్బందులు పడుతున్న ఎర్రగుంట్ల నగరవాసులు
ఎర్రగుంట్ల, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్లనగరపంచాయతికి డంపిం గ్ యార్డు ఒక కలగా మిగిలిపోయింది. జిల్లాలోనే మేజర్ గ్రామపంచాయ తిగా ఉన్న ఎర్రగుంట్ల 2012లో నగరపంచాయతిగా మారింది. అప్పటి వర కు అరకొర సిబ్బందితో, చాలిచాలని నిధులతో ఇబ్బందిగా ఉండేది. అయితే నగరపంచాయతి నుంచి రకరకాలుగా నిధులు రావడంతోపాటు సుమారు వంద మంది వరకు శాశ్విత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నగర పంచాయతిలో పనిచేస్తున్నారు. అయినా డంపింగ్ యార్డుకు మాత్రం మోక్షం రాలేదు. 2015లో పెద్దనపాడు వద్ద డంపింగ్ యార్డును అప్పటి కలెక్టర్ మంజూరు చేశారు. అయితే అక్కడి ప్రజలు అభ్యంతరం పెట్టడం, కోర్టుకు వెళ్లడంతో అది రద్దయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థల అన్వేషణ జరుగుతూనే ఉంది. గత సంవత్సరం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సొంతనిధులు ఇస్తానని స్థలం చూసుకోవాలని హామీ ఇచ్చారు. అప్పటి వైసీపీ పాలకులు స్థలాన్వేషణలో రాజకీయం చేశారే కాని స్థలం మాత్రం కొనలేదు. దీంతో వైసీపీ ఐదేళ్లు పుణ్యకాలం గడిచిపోయింది. నగరపంచా యతి వద్ద నిధుల్లేవు. దీంతో డంపింగ్ యార్డుకోసం చేసే ప్రయత్నాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది.
దట్టమైన పొగలతో ఇబ్బందులు పడుతున్న జనం
నగరపంచాయతీలో సేకరించిన చెత్తనంతా కడపరోడ్డు జువారీ రైల్వే కట్టవెంబడి వేస్తూ నిప్పు పెట్టడంతో బారీగా పొగ నిండుకుంటోంది. ఈ పొగ వల్ల ఊపిరిత్తుల సమస్య వస్తోందని సమీప ప్రాంతాల వారు ఫిర్యా దులు చేస్తున్నారు. అలాగే సాయంత్రం, రాతివేళల్లో ఎనహెచ రోడ్డంతా పొగతో నిండుకుని వాహనాల రాకపోకలకు ఇబ్బందికలగడంతోపాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. గనుల సమీపం లో తక్కువ ధరలకు ఇచ్చే భూములుండడంతోపాటు ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకునే వారులేరు. . ప్రొద్దుటూరురోడ్డు, హనుమనగుత్తి రోడ్లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదీకాక వ్యవసాయ భూముల రైతులు, వాటిని డంపింగ్ యార్డుకు ఇవ్వరు. ప్రస్తు ప్రభుత్వం ఎర్రగుంట్లకు డంపిం గ్‌యార్డు మంజూరు చేస్తే ఎర్రగుంట్ల ప్రజలకు సమస్యలుండవు.
ప్రభుత్వానికి నివేదిక పంపాం
ఎర్రగుంట్లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు 15ఎకరాల భూమి కావాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. అందుకు రూ.3.5కోట్లు నిధులు కావాల్సి ఉంది. నేషనల్ గ్రీన ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మెటీరియల్ రికవరి స్పెషలిటి కోసం 15ఎకరాలు కావాలని ప్రతి పాదనలు ఇచ్చాం. ప్రభుత్వ స్థలాలులేవు. ప్రైవేటు స్థలాల కోసం రాశాం. ఎంఎల్‌ఏ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
-పేర్లి శేషఫణి, కమిషనర్, ఎర్రగుంట్లనగరపంచాయతీ