ఇనుప స్తంభాలు తొలగించరా..?
ABN , Publish Date - May 15 , 2025 | 11:42 PM
రెవెన్యూ డివిజన కేంద్రం, నియో జకవర్గ కేంద్రంతోపాటు నగర పంచాయతీగా ఉన్న జమ్మలమడుగు పట్ట ణంలో విద్యుత ఇనుప స్తంభాలు ప్రమాదరకరంగా మారిన పట్టించుకు నేవారు లేరు.
ప్రమాదకరంగా మారిన విద్యుత ఇనుప స్తంభాలు కొన్ని చోట్ల ఇళ్లపై ఒరిగిన వైనం ఆందోళనలో పట్టణ ప్రజలు
జమ్మలమడుగు, మే 15 (ఆంధ్రజ్యోతి):రెవెన్యూ డివిజన కేంద్రం, నియో జకవర్గ కేంద్రంతోపాటు నగర పంచాయతీగా ఉన్న జమ్మలమడుగు పట్ట ణంలో విద్యుత ఇనుప స్తంభాలు ప్రమాదరకరంగా మారిన పట్టించుకు నేవారు లేరు. పట్టణంలో సాధారణంగా జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాతకాలంనాటి ఇనుప స్తంభాలనే ఇంకా కొనసాగించడం పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద నుంచి పెద్దమ్మ విగ్రహం, మెయిన్‌బజార్ , వాసవీ కన్యకపరమేశ్వరీదేవి ఆలయం, అంభాభవానీ దేవాలయం వీధి, పలగాడి వీధిలో ఇనుప స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మలమడుగుకు 300 విద్యుతస్తంభాలు ఇప్పించానని ఎక్కడైనా సమస్య ఉంటే వాటిని ఉపయోగించు కుని పరిష్కారం చేయాలని చెప్పినా మరెందుకో ఆదిశగా విద్యుత శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. గత నెల రోజుల నుంచి పట్టణంలో విద్యుత్తు శాఖ కార్యాలయ ఆవరణలో సిమెంటు స్తంబాలు ఉన్నప్పటికి ఒరిగిన విద్యుత్తు ఇనుప స్తంభాలను మార్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కూరగాయల మార్కెట్ వద్ద ఇనుప స్తంభానికి సపోర్టుగా కిందపడకుండా పెట్టినట్లుగా స్థానికులు తెలిపారు. అలాగే పెద్దమ్మ విగ్రహం వద్ద, మెయిన్‌బజార్‌లో ఇనుప స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈనెల 17వ తేదీ రథోత్సవం ఉన్నందున సంబం ధిత విద్యుత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడీఈ ఏమన్నారంటే: విద్యుత ఇనుప స్తంభాల తొలగింపు విషయమై జమ్మలమడుగు విద్యుత శాఖ ఏడీఈ రాజగోపాల్ ను ‘ఆంధ్రజ్యోతి’ వివ ర ణ కోరగా నారాపురం స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పను లు చేపడతామన్నారు. స్తంభాలు తొలగించాలం టే రోడ్డును పగులగొట్టి పనులు చేయాల్సి ఉం టుందన్నారు.