బాధ్యతతో ప్రజా సేవ చేయండి
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:34 PM
మైదుకూరు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం బాధ్యతగాపని చే సి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నా రు.

మైదుకూరు రూరల్ ,జూన్ 6(ఆంధ్ర జ్యోతి) : మైదుకూరు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం బాధ్యతగాపని చే సి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నా రు. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచే సేవారికి పార్టీలో ఉన్నతస్థానం లభిస్తుందనడానికి ఏపీ రవీంద్రకు మా ర్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడమే నని ఆయన అన్నారు. మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఏపీ రవీంద్ర సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి శుక్ర వారం నియోజకవర్గంలోని టీడీపీ నా యకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నా రు. రవీంద్ర ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా జిల్లా పరిష త్ హైస్కూల్ వద్ద కు చేరుకొ న్నారు. అక్కడ మార్కెట్ కమిటీ అధికారులు చైర్మన్‌గా ఏపీ రవీంద్ర, వైస్ చైర్మన్‌గా నాయబ్‌రసూల్, మెంబర్లుగా ఎ. భారతి, పి కార్తీక, ఎస్ హుసేన్‌బీ, జి లక్ష్మి భర త్, జయలక్ష్మి, ఎస్ వనజ, ఆశీ ర్వాదం, క్రిష్ణనాయక్, వెంకటరమణ య్య, వెంక టసుబ్బమ్మ, క్రిష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి, రత్నమ్మలు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వ ర్యంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టా మా ట్లాడుతూ మున్సిపాలిటీలో నీటి సమ స్య లేకుండా పోయిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయ కు లు హరిప్రసాద్, పార్టీ పట్టణ అధ్య క్షుడు దాసరిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబరు యాపరాల చిన్న, పం దిటి మల్హోత్ర, భీమయ్య, సుబ్బారెడ్డి, అన్నవరం సుధాకర్‌రెడ్డి, పుట్టా ప్రభాక ర్‌యాదవ్, కేశ ఎరికిల య్య, బండి అమర్ నాధ్, తుపాకుల రమణ, ధన పాల యుగంధర్, ధనపాల భారతి, నాగశివారెడ్డి పాల్గొన్నారు.
ఖాజీపేటలో: మైదుకూరులో శుక్రవారం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా రవీంద్ర, వైస్‌ఛైర్మన్‌గా నాయబ్‌రసూల్‌ను టీడీపీ రాష్ట్ర మైనార్టీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి కదిరుల్లా, నాయకులు గజమాలతో సత్కరించారు.