సచివాలయ ఉద్యోగుల జీవో 5 రద్దు చేయాలి
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:12 PM
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, రేషనలైజేషన కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
రాయచోటి(కలెక్టరేట్), జూన23(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, రేషనలైజేషన కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో భోజన వి రామ సమయంలో వారు నిరసనలు తెలిపారు. అనంతరం డీఆర్‌వో మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో సచివాలయం ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందన్నారు. సొంత మండలం, మున్సిపాలిటీల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు. రేషనలైజేషన ప్రక్రియ చేసిన తరువాతనే బదిలీలు చేయాలన్నారు. రేషనలైజేషన అనేది ఎలా చేస్తారు, ఎవరని చేస్తారు నేది స్పష్టత లేకుండా జీవోను విడుదల చేశారన్నారు. దీనివల్ల సీనియారిటీ వాళ్లకు నష్టం జరుగుతుందన్నారు. సచివాలయం ఉద్యోగుల యూనియన రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఏపీఎన్జీజీవోఎస్ తాలూకా ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, లక్ష్మీప్రసన్న, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.