నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:45 PM
వేస వి సెలవుల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురు వారం (ఈనెల12) నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి.
సెలవుల్లోనే విద్యాసామగ్రి పంపిణీ నాణ్యమైన విద్యకోసం 9 రకాలుగా పాఠశాలల మార్పు భోజనం కోసం సన్నబియ్యం, మెనూలో మార్పు
ప్రొద్దుటూరు టౌన్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):వేస వి సెలవుల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురు వారం (ఈనెల12) నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి. దీంతో పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థు లు, ఉపాధ్యాయులు సంసిద్ధులయ్యారు. కాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రీప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేసింది. పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లోనే పూర్తి విద్యాసామగ్రి సరఫరా చేసింది. మండలంలో 111 ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలలు ఉండగా ఆ పాఠశాలలో 13,869 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురువారం పాఠశాలలు ప్రారంభం కాగానే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, మూడు జతల యూనిఫారం, బూట్లు, సాక్సులు, బెల్టులు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ విద్యార్థులకు అందించనున్నారు.
మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం
మధ్యాహ్న భోజనంలో లావు బియ్యం తినలేక విద్యార్థులు ఇబ్బందిపడేవారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యం పంపిణీ చేపట్టింది. మొదటి రోజు నుంచే సన్నబియ్యంతో భోజనం వడ్డించనున్నారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం వడ్డించడానికి మెనూలోనే మార్పులు చేశారు. అలాగే వంట చేసేవారు శుభ్రత పాటించే విధంగా వంట పాత్రలు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అమలు చేయనున్న జోన్4 మెనూపై వంట ఏజెన్సీలకు సెలవుల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఆకర్షణీయమైన రంగుల్లో ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం సరఫరా చేశారు. 9 రకాల పాఠశాలలకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తికాగా మరో రెండు రోజుల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తికానున్నాయి. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రతి స్కూల్ కాంప్లెక్స్‌కు ఒక అదనపు ఉపాధ్యాయున్ని నియమించారు. విద్యాశాఖలో మార్పుల ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
నేడు విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ
కొండాపురం, జూన 11 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల ల పునః ప్రారంభం సందర్భంగా గురువారం విద్యార్థులకు స్కూల్ కిట్లను అందజేయనున్నట్లు ఎంఈవో రామయ్య తెలిపారు. మండలంలోని 52 రప్రభుత్వ పాఠశాలల్లో 2982 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఎంఈవో తెలిపా రు. కాగా స్కూల్ కిట్‌లో భాగంగా ప్రభుత్వం స్కూల్‌బ్యాగ్, నోట్ పుస్తకాలు షూస్, సాక్స్, బెల్ట్, యూనిఫాం, టెక్స్ట్‌బుక్‌ను విద్యార్థులకు ఉచితంగా అందజేయనుంది.
మండలానికి చేరిన సన్నబియ్యం
కాశినాయన జూన11ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ఈవిద్యా సంవత్సరం నుంచి సర్కారు పాఠ శాలలు,కళాశాలలు, వసతి గృహాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు,వసతి గృహాలకు ప్రత్యేక బ్యాగుల్లో నాణ్యమైన సన్నబి య్యాన్ని సరఫరాచేసింది. దీంతో గురువారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా ర్థులకు సన్నబియ్యంతో మద్యాహ్న భోజనం అం దుబాటులోకి రానున్నది. ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఏడాదికి సన్నబియ్యం అందించ డంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.