Share News

చిప్పిలిలో సహ స్త్ర లింగార్చన

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:13 PM

చిప్పిలి గ్రామంలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం సహస్త్ర లింగార్చన నిర్వహించారు.

చిప్పిలిలో సహ స్త్ర లింగార్చన
రుద్రాక్షలతో నిర్వహిస్తున్న సహస్త్ర లింగార్చన

మదనపల్లె అర్బన్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): చిప్పిలి గ్రామంలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం సహస్త్ర లింగార్చన నిర్వహించారు. జగద్గురు పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకర భారతి స్వామి పాల్గొన్నారు. సాయంత్రం విద్యాశంకర భారతీ స్వామి ప్రవచనాలను భోధించారు. బుధవారం స్వామిచే సత్యదేవ సదన్‌ ప్రారంభి స్తారు. ఆలయకమిటీ అధ్యక్షుడు ఎ.అమరనాథ్‌, కార్యదర్శి రామకృష్ణ, కొశాధికారి దివాకర్‌, కో ఆర్డినేటర్‌ శివశంకర్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:13 PM