Share News

పదేళ్ల తర్వాత కామనూరుకు ఆర్టీసీ రైట్‌ రైట్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:49 PM

దువ్వూరు నుంచి కామనూరు మీదుగా నడిచేందుకు పలె ్ల వెలుగు బస్సును శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రారంభించారు .

పదేళ్ల తర్వాత కామనూరుకు ఆర్టీసీ రైట్‌ రైట్‌
బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పుట్టా

పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

దువ్వూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు నుంచి కామనూరు మీదుగా నడిచేందుకు పలె ్ల వెలుగు బస్సును శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రారంభించారు . ఈ రోడ్డుమీదుగా పదేళ్ల నుంచి ఆర్టీసీ బస్సు నడవడంలేదు. ప్రైవేటు బస్సుల హవా కొనసాగుతున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే నిమిత్తం ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ చొరవ తీసుకుని పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేయించారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన దువ్వూరు, మురళీనగర్‌, నేలటూరు, ఎర్రబల్లె, కామనూరు, నక్కలదిన్నె ప్రాంతాల మహిళలు హర్షం వెలిబుచ్చుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణారెడ్డి, రాంబాబు, అందె శ్రీనివాసులు, పోలు రామమోహన్‌రెడి ్డ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 11:49 PM