కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల దీక్షలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:13 PM
నేషనల్ మజ్దూర్ యూనియన అసోసియేషన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటి డిపో ఎదుట మంగళవారం రెండవ రోజు కూడా ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
రాయచోటిటౌన, ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): నేషనల్ మజ్దూర్ యూనియన అసోసియేషన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటి డిపో ఎదుట మంగళవారం రెండవ రోజు కూడా ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎనఎంయూ రీజనల్ అధ్యక్షుడు ఎంఎనరావు, కార్యదర్శి పీఎ్‌సఎం రాజు డిపో ఎదుట రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు ఎం. రెడ్డెప్ప, సుధాకర్, హరినాథ, ఎంహెచనాయుడు పాల్గొన్నారు. అనంతరం నేషనల్ మజ్దూర్‌యూనిటీ అసోషియేషన రీజనల్ నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గతంలో అనేక దఫాలుగా ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంఆ రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రీజనల్ నాయకులు సీవీ రమణ, ఎంఎస్ ప్రసా ద్, టీ. రామాంజులు, డిపో నాయకులు ఆర్‌వీ గోపాల్, డీఎస్ వాసులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షలో ఆర్టీసీ ఉద్యోగులు
రాజంపేట, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎస్‌ఎంయూ ఆధ్వర్యంలో రెండో రోజైన మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రమణ, గ్యారేజి కార్యదర్శి దేవరాజులు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సర్క్యులర్ 1/2019 అమలు చేయాలన్నారు. అక్రమ సస్పెన ఆపాలని, గ్యారేజ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. అనారోగ్య సెలవుకు పూర్తి వేతనం చెల్లించాలని, లైట్ ఔట్ అలెవన్స 400 రూపాయలు వెంటనే చెల్లించాలన్నారు. పారదర్శకమైన ట్రాన్సఫర్‌లు పాలసీ అమలు చేయాలని, ఉద్యోగుల విశ్రాంత దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో అనుమతించాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవులు తక్షణమే మంజూరు చేయాలని, ఇంకా ఉన్న సమస్యలపై ప్రత్యేక నిఽనాదాలు చేస్తు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యారేజి అధ్యక్షుడు గోపాల్, డిపో ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, ఈశ్వరి, జాయింట్ సెక్రటరి సుబ్బయ్య, ఆర్వీ భాస్కర్, శంకరయ్య, కుమారితో పాటు గ్యారేజ్ డిపో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.