Share News

త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:50 PM

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్‌ బీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌ కేఎంఎల్‌ నరసింహ తెలిపారు.

త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు
ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం సమర్పిస్తున్న కేఎంఎల్‌ నరసింహ

రాజంపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్‌ బీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌ కేఎంఎల్‌ నరసింహ తెలిపారు. బుధవారం ఆర్టీసీ డీఎం రమణయ్యతో ఈ విషయమై చ ర్చించారు. భక్తులకు, పర్యాటకులకు తాళ్లపాక నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం కల్పిస్తే అన్నివిధాల న్యాయం జరుగుతుందని డీఎంకు వివరించగా ఆయన సానులకూంగా స్పందించినట్లు తెలిపారు. ఈ చర్చల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ మాధవిలత, కేఆర్‌ఎన రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు.

Updated Date - Jul 16 , 2025 | 11:50 PM