ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:02 AM
ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి అని రామాపురం తహసీల్దార్ రామాంజనేయులు అన్నారు.
రామాపురం, మే31(ఆంధ్రజ్యోతి): ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి అని రామాపురం తహసీల్దార్ రామాంజనేయులు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రాచపల్లి వీఆర్‌వో వెంకటసుబ్బారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్‌వో వెంకటసుబ్బారెడ్డి రామాపురం మండలానికి 2022 ఫిబ్రవరి 26న బాధ్యతలు చేపట్టారన్నారు. ఈయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. తోటి వీఆర్‌వోలు కార్యాలయం సిబ్బంది పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. ఆర్‌ఐ సమ్మద్‌ఖాన, టీడీపీ నాయకులు గంగిరెడ్డి, లక్ష్మీరెడ్డి, మదన, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.