Share News

గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి : ఆర్డీవో

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:40 PM

జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రీ సర్వే ఇచ్చిన గడువు లోపు పూర్తిచేయాలని ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర ్లకు సూచించారు.

గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి : ఆర్డీవో
రీ సర్వేపై సమీక్షా సమావేశంలో ఆర్డీవో సాయిశ్రీ, అధికారులు

జమ్మలమడుగు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రీ సర్వే ఇచ్చిన గడువు లోపు పూర్తిచేయాలని ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర ్లకు సూచించారు. సోమవారం సాయంత్రం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో డివిజన్‌ పరిధిలోని సర్వేయర ్లకు రీ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ రీ సర్వే విమర్శలకు తావివ్వరాదని ఇప్పటి వరకు రీ సర్వేపై మిగిలి ఉన్న గ్రామాల్లో నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. రీ సర్వే నవంబరు నాటికి గ్రామాల్లో బౌండ్రీలు ఏర్పాటు చేయడంతోపాటు. డిసెంబరు 1 నాటికి పట్టా భూములకు సంబందించి రీసరే ్వ ప్రారంభించాలన్నారు. ఫీల్డ్‌లో ఎక్కడ సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సెప్టెంబరు 15 నాటికి రీ సర్వేకుసంబందించిన ఫీల్డ్‌ రికార్డులు వీఆర్వోలు పూర్తి చేయాలన్నారు. ఒక రైతుకు ఎకరా భూమి ఉండి అలాంటివారికి ఆనలైనలో ఎక్కువ చూపిస్తున్నట్లు ఉంటే సమగ్ర వివరాలు తీసుకుని సరిచేయాలన్నారు. కార్యక్రమంలో సర్వేయర్లు హరి, ఏవో ఇక్బాల్‌బాష, డివిజన్‌ పరిధిలోని సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:40 PM