Share News

ప్రతి సమస్యకూ తక్షణం స్పందించాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:26 PM

ప్రతి సమస్యకూ తక్షణం స్పందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

ప్రతి సమస్యకూ తక్షణం స్పందించాలి
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, జూన15(ఆంధ్రజ్యోతి): ప్రతి సమస్యకూ తక్షణం స్పందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. చిన్నమండెం మండలంలోని తన నివాసమైన బోరెడ్డిగారిపల్లెలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తక్షణమే పలువురు అధికారులను ఆదేశించారు. పలు సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారాన్ని అందించిన మంత్రి ప్రజల్లో విశేష విశ్వాసాన్ని నెలకొల్పారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ పరిష్కారమే ప్రధానంగా ప్రతి సమస్యకు తక్షణ స్పందన, పరిష్కారమే లక్ష్యం చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 15 , 2025 | 11:26 PM