Share News

రోడ్డుకు ఇరువైపుల మట్టికుప్పలు తొలగింపు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:16 AM

దువ్వూరు మండలం మూడిండ్లపల్లె తారురోడ్డుకు ఇరు వైపుల ఉన్న మట్టి కుప్పల తొలగింపు పనులు ఎట్టకేలకు బుధవారం మొదలు పెట్టారు.

రోడ్డుకు ఇరువైపుల మట్టికుప్పలు తొలగింపు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

దువ్వూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు మండలం మూడిండ్లపల్లె తారురోడ్డుకు ఇరు వైపుల ఉన్న మట్టి కుప్పల తొలగింపు పనులు ఎట్టకేలకు బుధవారం మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో తారు రోడ్డు నిర్మించి వంద రోజులకుపైగా అయింది. అయితే రోడ్డు వేసి ఇరువైపుల సత్తుతో కూడిన మట్టి కుప్పలను అలాగే వదిలేశారు. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో ‘రోడ్డు సరే మట్టికుప్పలేంటి’ అనే శీర్షికతో ఈనెల 1వ తేదీ కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఆర్‌అండ్‌బీ అధికారులు అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు పూనుకున్నారు. మట్టికుప్పలను తొలగించి రోడ్డుకు ఇరువైపుల గ్రావెల్‌ తోలుతున్నారు. సదరు గ్రావెల్‌ను డోజర్‌తో నడుపుతూ పనులను చదును చేస్తున్నారు. పెండింగ్‌ పనులు చేపడుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:16 AM