ఈ పంట నమోదు తప్పనిసరి
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:40 PM
ఖరీఫ్‌లో సాగు చేసి పంటలన్నింటికీ విధి గా ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచిం చారు.
జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ
పీలేరు రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసి పంటలన్నింటికీ విధి గా ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచిం చారు. బుధవారం తలపుల, మేళ్లచెరువు పంచాయతీల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ లబ్ధిపొందే రైతులు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవా లని తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా రైతులు డ్రోన్ల టెక్నాలజీని ఉపయోగించు కోవాలని సూచించారు. పంట సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకోవా లన్నారు. తద్వారా అవసరమైన ఎరువులు సరైన మోతాదులో వాడాలని చెప్పారు. తలపుల, మేళ్లచెరువు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. శ్రీఅన్నమయ్య రైతు సహకార సంఘంలో ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. మేళ్లచెరువులో వేరుశనగ పొలాన్ని సందర్శించి పొలం పిలుస్తోందిలో పాల్గొన్నారు. పీలేరు ఏడీఏ వై.వీ. రమణరావు, ఏఓ రమాదేవి, నవంత్, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.