సినిమా ఽథియేటర్లను తనిఖీ చేసిన ఆర్డీవో
ABN , Publish Date - May 29 , 2025 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఽసిని మా ఽథియేటర్లలో ధరలు అమలు చేయాలని ఆర్డీవో సాయిశ్రీ సిని మా ఽఽథియేటర్ల యజమానులను హెచ్చ రించారు.
ప్రొద్దుటూరు/జమ్మలమడుగు, మే 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఽసిని మా ఽథియేటర్లలో ధరలు అమలు చేయాలని ఆర్డీవో సాయిశ్రీ సిని మా ఽఽథియేటర్ల యజమానులను హెచ్చ రించారు. బుఽధవారం పట్టణంలోని ఆర వేటి ఽథియేటర్, అమీర్ ఽథియేటర్, సినీ హబ్ సిని మా ఽథియేటర్లను ఆర్డీవో సాయిశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె సిని మా టికెట్ల ధరలను ,తిరుబండారాల ధరలను, సైకిల్‌స్టాండ్ ధరలను అడిగితెలు సుకున్నారు. నిబంధల మేరకే టికెట్ల ధరల తో పాటు అన్ని ధరలు అమలు చేయాలని లేకుంటే సినిమా హాలు మూసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవో వెంట తహసీల్దారు గంగయ్య ఉన్నారు. డివిజన్ కేంద్రమైన జమ్మలమడుగు పట్టణంలో బుధవారం రాత్రి ఆర్డీవో సాయిశ్రీ సినిమా థియేటర్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆర్డీవో సాయిశ్రీ, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి పట్టణంలోని టీఎన్‌ఆర్, టీపీఆర్ సినిమా థియేటర్లను తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను ఆరా తీశారు. తనిఖీలో భాగంగా థియేటర్లలో తినుబండారాల ధరలు, పారిశుధ్యం,తదితర విషయాలను ఆర్డీవో పరిశీలించి థియేటర్ యజమానులకు పలు సూచనలు చేశారు.