Share News

వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ సక్రమంగా ఇవ్వాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:39 PM

మండలంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్‌ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మదర్‌థెరీస్సా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు షాకీర్‌హుస్సేన్‌ కోరారు.

వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ సక్రమంగా ఇవ్వాలి
తహసీల్దారుకు వినతిపత్రమిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్‌ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మదర్‌థెరీస్సా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు షాకీర్‌హుస్సేన్‌ కోరారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తహసీల్దారు గంగయ్యకు ఆమేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కొందరు డీలర్లు దివ్యాంగులు, వృద్ధులకు ఇళ్లవద్ద సక్రమంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేయడంలేదని తెలిపారు. ప్రతినెలా ఇళ్ల వద్దనే సక్రమంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jun 23 , 2025 | 11:39 PM