Share News

రేషన సక్రమంగా పంపిణీ చేయాలి

ABN , Publish Date - May 24 , 2025 | 12:00 AM

ప్రభు త్వ ఆదేశాలను తూ.చ, తప్పకుండా పాటిస్తూ రేషన్‌ డీలర్లు ప్రజలకు సక్రమంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని జమ్మలమడుగు తహసీల్దారు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

రేషన సక్రమంగా పంపిణీ చేయాలి
జమ్మలమడుగులో డీలర్లతో మాట్లాడుతున్న తహసీల్దారు శ్రీనివాసరెడ్డి

డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర సరుకులు అందించాలి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : తహసీల్దార్ల సూచన

జమ్మలమడుగు, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ ఆదేశాలను తూ.చ, తప్పకుండా పాటిస్తూ రేషన్‌ డీలర్లు ప్రజలకు సక్రమంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని జమ్మలమడుగు తహసీల్దారు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మలమడుగు తహసీల్దారు కార్యాలయంలో మండలంలోని 37 మంది రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందరికి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలన్నారు. తక్కువ తూకాలు ఇచ్చి పేదల కడుపు కొడితే నిబంధనల మేరకు తప్పనిసరిగా కేసులు నమోదు చేయడంతోపాటు డీలర్‌షిప్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. కొందరు రేషన్‌షాపుల వారు ఏదైనా పని ఉండి ఎక్కడికైనా వెళ్లినట్లయితే ముందుగానే సమాచారం ఇచ్చి రేషన సత్వరం లబ్ధిదారులకు అందేలా చూడాల న్నారు. ప్రతినెల 15వ నుంచి 20వ తేదీ వరకు రేషన్‌ డీలర్లతో సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్‌డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

డీలర్లు 15 రోజులు బియ్యం ఇవ్వాలి

చాపాడు, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ చౌక దుకాణ డీలర్లు జూన్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ప్రజలకు పంపిణీ చేయాలని తహసీల్దారు రమాకుమారి సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం డీలర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వాహనాల ద్వారా బియ్యం పంపిణీ నిలిపివేసి డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రికార్డులు భద్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీటీ కృష్ణారెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ మల్లికార్జున, ఆర్‌ఐ శివశంకర్‌రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో: రేషనకా ర్డు కలిగిన ప్రతి లబ్ధిదారు డికి సక్రమంగా రేషన అందే లా చూడా లని తహసీల్దారు చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక తహసల్దారు కార్యాలయంలో మండలంలోని 34 మంది రేషనషాపు డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మా ట్లాడుతూ రేషనకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సక్రమంగా రేషన అందించాలని తూకాల్లో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామ న్నారు. అలాగే 65 ఏళ్లు పైబడ్డ లబ్ధిదారుల జాబితా గుర్తించి వారికి రేషన వారి ఇంటి వద్దకు అం దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠి నంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమం లో అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:01 AM