రాజంపేట టీడీపీ బాధ్యతలు స్థానికులకు ఇవ్వాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:34 PM
రాజంపేట నియోజవర్గం టీడీపీ బాధ్యతలు స్థానిక నాయకులకే ఇవ్వాలని రాజంపేట టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య తెలిపారు.
ఒంటిమిట్ట, మే 23 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట నియోజవర్గం టీడీపీ బాధ్యతలు స్థానిక నాయకులకే ఇవ్వాలని రాజంపేట టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక హరిత హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక నా యకులకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బాగుపడుతుందన్నారు. రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య, మండల నాయకుడు పామూరు సుబ్రమణ్యం, మామిళ్ల ఈశ్వరయ్య పాల్గొన్నారు.