Share News

ప్రశ్నార్థకంగా పంటకాల్వలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:49 PM

రియల్‌ఎస్టేట్‌ రంగంతో పంట కాల్వల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

ప్రశ్నార్థకంగా పంటకాల్వలు
బెల్లగడ పంట కాల్వలో తుంగ పెరిగిన దృశ్యం

పోరుమామిళ్ల, జూలై 29 (ఆంధ్రజ్యోతి) :రియల్‌ఎస్టేట్‌ రంగంతో పంట కాల్వల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పొలాలకు సకాలంలో సక్ర మంగా నీరందించాలన్న ఉద్ధేశ్యంతో గతంలో ఏర్పాటు చేసిన పంటకాల్వలు రానురాను కుదించుకుపోవడమే కాకుండా కొన్నిచోట్ల ఆక్రమణలతో వాటి జాడేలేకుండా పోతోంది. పంట కాల్వల మరమ్మత్తులు చేపట్టకపోవడం, ఆక్ర మణలకు గురైన వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో అసలు కాల్వలు ఎక్క డ ఉన్నాయా? అని పరిశీలించుకోవాల్సిన సరిస్థితి ఏర్పడింది. పోరుమామిళ్ల చెరువు ఆయకట్టు సుమారు 4400 ఎకరాలు కాగా అనధికారికంగా దాదాపు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్ధ్యం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ చెరువు కింద గతంలో వెడల్పాటి పంట కాల్వలు ఉండి రంగసముద్రం రెడ్డికతవ, మల్లకతవ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరందేది. కానీ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ వెంచర్ల కోసం కాల్వలను పూడ్చడమో అధికార దర్పం చూపడంతో వాటిని పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. పోరుమామిళ్ల చెరువు నుంచి బుగ్గబావి, ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న కాల్వల ద్వారా రంగసముద్రం చెరువులోకి నీరు అందేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడంలేదు. కొందరు గృహ నిర్మాణాల కోసం ఈ పంట కాల్వలు కూడా పూడ్చివేయడంతో నీరు కింది చెరువులకు అందే పరి స్థితి లేకండాపోయింది. అంతేకాకుండా పోరుమామిళ్ల చెరవు నుంచి దమ్మన పల్లె మీదుగా మల్లకతవ, బెల్లగడ కాల్వకు రంగసముద్రం చెరువుకు గతం లో నీరందేది. ప్రస్తుతం ఆ కాల్వలన్నీ పూడిపోయి పిచ్చిమొక్కలు కనిపిస్తు న్నాయి. బెల్లగడ కాల్వకు సమీపంలో వ్యర్థాలు పడవేయడంతో పూర్తిగా కాలువ అంతా కలుషితమైపోయింది. కాల్వలన్నీ పూడిపోవడంతో వర్షం నీరు ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపైనే నిల్వ ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగి స్తోంది. గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఆర్టీసీ బస్టాండు ఆవరణమంతా నీటి కుంటను తలపించేలా ఉండేవి. అదే కాలవలు సక్రమంగా ఉంటే పడిన వర్షమంతా కాల్వల ద్వారా వెళితే సమస్య ఉండేది కాదు. అంతేకాక ఆర్టీసీ బస్టాండు దేశాయి ఽథియేటరు వెనుక వైపు ఉన్న పంట పొలాలు రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారడంతో ఆ పంట కాల్వలన్నీ ఒకటో, రెండో కాల్వలు తప్ప మిగతావి కానరాని పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు సంబంధిత అధికా రులు పంట కాలవలను సర్వే చేసి గతంలో ఉన్న పంట కాల్వలను పునరుద్ధ రించి పంట పొలాలకు చెరువులకు నీరందించే విధంగా చర్యలు తీసుకో వాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

కాలువలను పరిశీలించి నివేదికలు పంపుతాం

పోరుమామిళ్ల చెరువుకు సంబంధించి అత్యవసర పనులు చేయించాం. పంట కాలువలకు అవసరమైన చోట్ల అంచనాలు తయారు చేసి అధికారులకు నివేదికలు పంపుతాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరైతే కాలువ పనులు చేయిస్తాం.

-సుజని, తెలుగుగంగ ఏఈ, పోరుమామిళ్ల

Updated Date - Jul 29 , 2025 | 11:49 PM