Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:00 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.శుక్రవారం కేశాపురం, దేవళంపేట గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి మండిపల్లి

చిన్నమండెం, జూలై4(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.శుక్రవారం కేశాపురం, దేవళంపేట గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డోర్‌ టు డోర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనుల ప్రజలకు వివరించారు.

పలు అభివృద్ధి పనులకు భూమిపూజ

మండలంలోని కేశాపురం గ్రామం రెడ్డివారిపల్లెకు వరకు రూ.60 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణకు భూమి పూజ చేశారు. జిల్లా పరిషత బాలికల హైస్కూల్‌లో రూ.43 లక్షలతో నిర్మించిన ప్రహరీ, ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైస్కూల్‌లో సమస్యలను త్వరలోనే పరిష్కరించి పిల్లలకు కావాల్సిన పరికరాలను తన సొంత నిధులతో తెప్పిస్తానని హామీ ఇచ్చారు. బోరెడ్డిగారిపల్లెలో ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి హరిత, మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి భూమిపూజలో పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:01 PM