Share News

ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:58 PM

అన్ని రంగాల్లో విశిష్టత కలిగిన ప్రొద్దుటూరు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో విశిష్టత కలిగిన ప్రొద్దుటూరు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలను కలిపి ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. నూతన జిల్లా ఏర్పాటు కోసం మొదట మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. . ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు ప్రొద్దుటూరుకు ఉన్నాయని తెలిపారు. ఎన్జీవో అసోసియేషన్‌ ప్రొద్దుటూరు తాలూకా యూనిట్‌ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి, శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, భాస్కరరావు, గజ్జెల వెంకటేశ్వర్లురెడ్డి, శివనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:58 PM