ప్రధమ బహుమతి సాధించిన ప్రొద్దుటూరు ఎడ్లు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:10 AM
అట్లూరు మండలంలోని కామసముద్రం అంకాలమ్మ జాతరలో భాగంగా ఆదివారం నిర్వహించి ఎద్దుల పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన ద్వారశిల గుర్విరెడ్డి ఎడ్లు ప్రధమ బహుమతి లక్ష నూటా పదహారు రూపాయలు గెలుచుకున్నాయి.

్ఞఅట్లూరు, జూన 8 (ఆంధ్రజ్యోతి): అట్లూరు మండలంలోని కామసముద్రం అంకాలమ్మ జాతరలో భాగంగా ఆదివారం నిర్వహించి ఎద్దుల పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన ద్వారశిల గుర్విరెడ్డి ఎడ్లు ప్రధమ బహుమతి లక్ష నూటా పదహారు రూపాయలు గెలుచుకున్నాయి. అలాగే రెండో బహుమతి రంగసానిపల్లెకు చెందిన మాచర వెంకటసుబ్బారెడ్డి ఎడ్లు రూ.80,116, మూడో బహుమతి అనంతపురం జిల్లా గార్లదిన్నెకు చెందిన కె.రామాంజ నేయులు ఎడ్లు రూ..60116, నాలుగో బహుమతి ఖాజీపేటకు చెందిన కవ్వా బాలయ్య ఎడ్లు రూ.40116, ఐదో బహుమతి రూ.20116లు ద్వారశిల గుర్విరెడ్డి ఎడ్లు గెలుచుకున్నాయి. గెలుపొందిన ఎడ్లదారులకు ఆలయ కమిటీ బహుమతులు అందించారు. అనంతరం సుడిబండి కార్యక్రమం గుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. కోలాటాలు, భజన కార్యక్రమాలు చూసేందుకు మండల ప్రజలు భారీగా తరలివచ్చారు.