Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - May 23 , 2025 | 12:02 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఉపాధి కూలీలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, మే22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం చి న్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మం త్రి ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

మహాభారతం నిర్వహణకు మంత్రి రూ.1,16,000 విరాళం

చిన్నమండెం మండలంలో నిర్వహించే మహాభారతం సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నిర్వాహకులకు రూ.ఒక లక్షా 16 వేల విరాళం ఇస్తానన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు

హనుమాన జయంతి సందర్భంగా దేవగుడిపల్లి కొండమూల ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి, వండాడి ఆం జనేయస్వామి ఆలయాల్లో మంత్రి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఉపాధి హామీ పథకం కూలీలతో మంత్రి

వండాడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కూలీలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బిల్లులు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు వెళ్లి ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:02 AM