Share News

దుక్కులతో సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - May 16 , 2025 | 11:55 PM

ఖరీఫ్‌ సీజన త్వరలో ప్రారంభం కానుండడంతో రైత న్నలు దుక్కులు దున్ని పొలాలను సాగుకు సన్నద్ధం చేస్తున్నారు.

దుక్కులతో సాగుకు సన్నద్ధం
ఎద్దులతో దుక్కులు దున్నుతున్న రైతన్న

రాజుపాలెం, మే 16 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ సీజన త్వరలో ప్రారంభం కానుండడంతో రైత న్నలు దుక్కులు దున్ని పొలాలను సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. ఒక పక్క వేసవి ఎండలు మండుతుండగా మరో పక్క అరకొరగా అకాల వర్షాలు అక్కడక్కడ పడుతుండడంతో దుక్కు లు మొదలుపెట్టారు. జూన మొదటి వారం నుంచి జూలై వరకు పంట పొలాలను చదను చేసుకోవడం ద్వారా పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలుపుతున్నారు. ముం దుగా వేసవి దుక్కులు దున్నడం ద్వారా పంట పొలాల్లో చీడపీడలు కూడా గుడ్లు పెట్టుకునే వాటిని నాశనం చేయడంతో పాటు వేసవి దుక్కులు పంట పొలాలకు బలం చేకూరుస్తుం ది. గ్రామాల్లో ఉన్న పశువుల పేడ పంట పొలా లకు తోలుకుని రైతులు వాటిని చల్లుకుంటూ సన్నద్ధమవుతున్నారు. మరింత వర్షాలు పడితే ఈ పనులు ముమ్మరంగా సాగే విధంగా రైతు లు నడుంబిగిస్తున్నారు. గత వారంలో పడ్డ వర్షానికి పంట పొలాల్లో దుక్కులు వస్తుండడం తో ట్రాక్టర్లు, ఎద్దుల ద్వారా తమ పొలాలను దున్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడా ది పత్తి పంట సరైన గిట్టుబాటు ధర లేక పోవ డంతో పాటు వాతావరణం అనుకూలించక పం టను పూర్తిగా వదిలేసిన రైతన్నలు ఈ ఏడాది రుతు పవనాలు ముందే వస్తుండడంతో పత్తి పంట సాగు చేసుకునేందుకు రైతన్నలు ఆసక్తి కనపరుస్తున్నారు. సకాలంలో వర్షాలు పడితే ఎక్కువ శాతం మినుము, పత్తి, కంది సాగు చేసుకునేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు.

విత్తనాలు ఎరువులు అందించండి

గత ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో విత్తనాలు ఎరువులకు కొంత మేర ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం సబ్సిడీతో విత్తనాలు ఎరువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలుపుతుండడంతో సకా లంలో వాటిని అందిస్తేకాస్త మేలు జరుగుతుం దని రైతులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా పంట సాగుకు అనుకూల పరిస్థితులు కనబడు తుండడంతో దుక్కులతో పొలాలను రైతన్నలు సంసిద్ధంచేస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 11:55 PM