ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - May 23 , 2025 | 11:32 PM
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
రాయచోటిటౌన, మే23(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎనకాలనీలో గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వినతులు స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీర్ఘకాలిక సమస్యలను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.