నిరుపయోగంగా పోలీస్ సబ్ సెంటర్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:44 PM
మైదుకూరు మండలంలో గతంలో పోలీస్‌సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేన సిబ్బంది కొరతతో అవి తీసివేయడంతో ఉన్న భవనం నిరు పయోగంగా మారింది.

మైదుకూరు రూరల్ ,జూన్ 7(ఆంధ్రజ్యో తి) :మైదుకూరు మండలంలో గతంలో పోలీస్‌సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేన సిబ్బంది కొరతతో అవి తీసివేయడంతో ఉన్న భవనం నిరు పయోగంగా మారింది. నియోజకవర్గంలో ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలలో జీవి సత్రం, వనిపెంట ఉన్నాయి.ఈ పం చాయతీలు రవాణా సౌకర్యాలు కలిగి ఉండడమే కాకుండా వ్యవసాయ పరంగా ఇక్కడ వ్యాపారాలు కూడా ఎక్కువే. అందువలన ఇక్కడ అల్లర్లు, దొంగతనాలు,పేకాట తదితర అసాంఘిక కార్యక లాపాలు జరుగకుండా వనిపెంట, జీవి సత్రంలో పోలీస్‌సబ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. అధికారులు స్పం దించి పోలీస్‌సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.