Share News

అంగనవాడీ వర్కర్లను అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:08 AM

అంగనవాడీ వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా లెక్కచేయకపోవడంతో పోలీసు లు వారిని అడ్డుకున్నారు.

అంగనవాడీ వర్కర్లను అడ్డుకున్న పోలీసులు
కొండాపురం రైల్వే స్టేషన వద్ద విజయవాడకు వెళుతున్న అంగనవాడీలను అడ్డుకున్న పోలీసులు

కొండాపురం, మార్చి 9 (ఆంధ్ర జ్యోతి:) అంగనవాడీ వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా లెక్కచేయకపోవడంతో పోలీసు లు వారిని అడ్డుకున్నారు. మం డ లంలో యూక్టివ్‌గా ఉండే యూనియన నేతలకు పోలీసులు ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయినా కొంతమంది అంగనవాడీ టీచర్లు, హెల్పర్లు ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు, మరికొంత మంది బస్సుల్లో విజయవాడకు తరలివెళుతుండగా వారిని అడ్డుకున్నారు. జీతాలు పెంచాలని తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమం తలపెడి తే ప్రభుత్వం తమను అడ్డుకోవడం అన్యాయమని ఈ సందర్భంగా పలువురు యూనియన నేతలు పేర్కొన్నారు.

మైదుకూరు రూరల్‌లో : అంగన్‌వాడీల జీతాలు పెంచాలంటు చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న అంగన్‌వాడీ టీచర్లను ఆదివారం పోలీసులు అదుపు లోకి తీసుకొన్నారు. దీనిపై ఎస్‌ఐ చిరంజీ వి మాట్లాడుతూ చలో విజయవాడ కార్య క్రమానికి అనుమతుల లేవని అందుకే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌ కు తీసుకొచ్చిట్లు ఆయన తెలిపారు.

ఎర్రగుంట్లలో: తమ హక్కుల కోసం పో రాటం చేసేందుకు నిర్వహిస్తున్న మహాధ ర్నాను అడ్డుకోవడం దారుణమని అంగన్వా డీ రాష్ట్ర నాయకురాలు మంజుల పేర్కొ న్నారు. ఆదివారం రాత్రి ఎర్రగుంట్లలో రైల్వేస్టేషనలో ధర్నాకు వస్తున్న అంగన్వా డీల పట్ల పోలీసుల ప్రవర్తన అభ్యంతర కరమన్నారు. మహా ధర్నాకు రైళ్లలో, బస్సుల్లో వస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అరెస్టులు చేయడం అమానవీయమన్నారు. రైల్వేస్టేషనలో అరెస్టులు చేసిన అంగన్వాడీలు పోలీసు లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - Mar 10 , 2025 | 12:08 AM