ఈ రోడ్డును కాస్త పట్టించుకోండి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:20 PM
జమ్మలమడుగులోని తాడిపత్రి-్డ కోవెలకుంట్ల వెళ్లే రోడ్డులో మూడు రోడ్ల కూడలి వద్ద గుంతలు పడి వర్షపునీరు నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది.
జమ్మలమడుగు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులోని తాడిపత్రి-్డ కోవెలకుంట్ల వెళ్లే రోడ్డులో మూడు రోడ్ల కూడలి వద్ద గుంతలు పడి వర్షపునీరు నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది. దీంతో కోవెలకుంట్ల రోడ్డు నుంచి ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు రోడ్డు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే బస్సులు, ఇతర భారీ వాహనాలు వెళ్లేటపుడు గుంతల్లో నిలిచిన నీరు వాహనదారులు, పాదాచారు లపై పడి ఇబ్బందులు కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. సంబందిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రత్యేక చొరవ చూపి రోడ్డుపై పడిని గుంతలుపూడ్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.