పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లువ
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:04 AM
పీజీఆర్‌ఎస్‌కు సమ స్యలు వెల్లువెత్తాయి.
జమ్మలమడుగు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు సమ స్యలు వెల్లువెత్తాయి. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు ప్రాంతాల నుంచి వినతి పత్రాలు అందజేశారు. డివిజన్ పరిధిలోని ప్రొద్దుటూరు, ముద్దనూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, తదితర మండలాల నుంచి అర్జీదారులు ఆర్డీవో సాయిశ్రీకి అర్జీలు అందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామానికి సంబందించిన కూటమి నాయకులు ఆర్డీవోను కలిసి సమస్యలు తెలిపారు.