సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 30 , 2025 | 11:51 PM
రానున్న వర్షాకాలం నేపథ్యం లో సీజనల్ వ్యాదుల పట్ల ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని కామ నూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్. హనీఫ్‌బాబా పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు రూరల్, మే 30 (ఆంధ్ర జ్యోతి): రానున్న వర్షాకాలం నేపథ్యం లో సీజనల్ వ్యాదుల పట్ల ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని కామ నూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్. హనీఫ్‌బాబా పేర్కొన్నారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే సందర్బంగా సోములవారి పల్లి పంచాయతీ పరిదిలోని పెన్నాన గర్, ఈశ్వరరెడ్డి నగర్‌లో దోమకాటు- ఆరోగ్యానికి చేటు అనే నినానదంతో ర్యాలీ, అవగాహన సదస్సును నిర్వహించారు. మలే రియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ దోమల వలన వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, పరిసరాల శుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో సూపర్‌వైజర్ వరప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ చంద్ర శేఖర్, ఏఎనఎంలు ఉమారాణి, వీరమ్మ, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.